తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అలర్ట్. తెలంగాణ ఓటర్ల సంఖ్య 3 కోట్లకు చేరింది. 2018 ఎన్నికల నాటికి 2.8 కోట్ల మంది ఓటర్లు ఉండగా…. 2023 జనవరికి ఆ సంఖ్య 2.99 కోట్లకు చేరింది. ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం… మొత్తం ఓటర్లలో 71% అంటే 2.12 కోట్ల మంది యువ, మహిళా ఓటర్లే ఉన్నారు. ఓటర్లలో పురుషులు 1,50,50,464 మంది మహిళలు, 1,49,25,243 మంది ఉన్నారు. అక్టోబర్ 4 న ఈసీ తుది ఓటరు జాబితాను ప్రకటించనుంది.
ఇది ఇలా ఉండగా, 2018లో లాగే ఈసారి కూడా మిజోరం, MP, రాజస్థాన్, ఛత్తీస్గడ్ రాష్ట్రాలతో కలిపి తెలంగాణ ఎన్నికలను నిర్వహించనున్నట్లు సమాచారం. అక్టోబర్ 17 కంటే ముందే ఎన్నికల షెడ్యూల్ రావొచ్చని అంటున్నారు. 2018లో షెడ్యూల్ రిలీజ్ అయిన 6 వారాలకు మిజోరంలో, 8 వారాలకు TSలో పోలింగ్ నిర్వహించారు. ఈ లెక్కన తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ తొలి రెండు వారాల్లో ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది.