కేసీఆర్ ను మెప్పించిన ‘పదగతులు స్వరజతులు’ సాంగ్

-

బ‌జ‌ర్దస్త్ టీవీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ స్టార్ రాకేష్ హీరోగా నటిస్తూ.. సినిమాను తానే  నిర్మిస్తూ ‘కేసీఆర్’ (కేశవ్ చంద్ర రమావత్) పేరుతో ఓ సినిమాను తీస్తున్నాడు. ఇటీవలే తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చేతులు మీదగా కేసీఆర్‌ సినిమా లాంఛ్‌ గ్రాండ్‌గా జరిగింది. తెలంగాణ ప్రాంతంలోని బంజారాల నేపథ్యంలో తెరకెక్కుతోంది. నిన్న కేసీఆర్ సాంగ్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే.

 

విడదలైన క్షణాల్లో సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మాజీ సీఎం కేసీఆర్ కి సైతం ఈ సాంగ్ చాలా బాగా నచ్చిందట. అందుకే ఇవాళ చిత్ర యూనిట్ ని పిలుపించుకొని కేసీఆర్ సాంగ్ సీడీనీ ఆవిష్కరించారు. ఈ సాంగ్ కి సంబంధించిన వీడియోను కేసీఆర్ తిలకించారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా  పదగతులు స్వరజతులు పల్లవించిన నేల తేనె తీయని వీణ రాగాల తెలగాణ ద్విపద దరువుల నేల… అంటూ సాగే ఈ పాటకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.ప్రముఖ ప్రజాకవి, గాయకుడు గోరటి వెంకన్న ఈ పాటకి సాహిత్యాన్ని అందించగా,చరణ్ అర్జున్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. గోరటి వెంకన్న, సింగర్ మనో, కల్పన ఈ పాటని పాడారు.

Read more RELATED
Recommended to you

Latest news