ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ యువ క్రికెటర్ శివమ్ దూబేపై ప్రసంశలు కురిపించారు. అతని బాల్ హిట్టింగ్ సామర్థ్యాన్ని బట్టి శివమ్ దూబే ‘ఇండియన్ క్రిస్ గేల్’ అని ప్రశంసల వర్షం కురిపించారు.టీ20 ప్రపంచ కప్ 2024కు అతన్ని ఎంపిక చేయడం ద్వారా ఇండియా సెలెక్టర్లు సరైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు.ఐపీఎల్ 2024లో శివమ్ దూబే ఆట చూసి ఆశ్చర్యపోయానని పనేసర్ అన్నారు. కాలు కదపుకుండా అతను బంతిని కొట్టే తీరు, అతని శక్తిని చూశాక క్రిస్ గేల్‌లా కనిపించాడని పేర్కొన్నారు.
“రింకూ సింగ్ మంచి ఫామ్‌లో లేకపోవడంతో అతని స్థానంలో మరొకరికి సెలెక్టరు అవకాశం ఇవ్వడం సరైనదని మాంటి పనేసర్ అన్నారు.అతని కంటే మెరుగైన ప్రదర్శన చేస్తున్న ఇతర ఆటగాళ్లు ఇండియాలో చాలా క్రికెటర్లు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా శివమ్ దూబే ఫామ్ అద్భుతం అని కొనియాడారు. అతను బంతిని కొట్టే విధానం నమ్మశక్యం కానిది. బహుశా అతనే ఇండియన్ క్రిస్ గేల్ అని చెప్పొచ్చు..” పనేసర్ ప్రశంసల వర్షం కురిపించారు.