గోపీచంద్ ఈ సారి ‘పక్కా కమర్షియల్’గా అప్పుడే వస్తున్నాడు..

-

టాలీవుడ్ మ్యాచో మ్యాన్ గోపీచంద్ నటిస్తున్న 29 వ చిత్రం ‘పక్కా కమర్షియల్’. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా రాశీ ఖన్నా నటిస్తోంది. ‘జిల్, ఆక్సిజన్’ చిత్రాల తర్వాత గోపీచంద్ తో కలిసి మూడో సారి ఈ భామ హీరోయిన్ గా నటిస్తోంది. ‘ప్రతి రోజు పండగే’ చిత్రం తర్వాత రాశీ ఖన్నా మరోసారి మారుతి దర్శకత్వంలో నటిస్తోంది. ఈ పిక్చర్ నుంచి విడుదలైన టీజర్ కు చక్కటి స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే మూవీపైన అంచనాలు పెరిగాయి.

జీఏ2 పిక్చర్స్- యూవీ క్రియేషన్స్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. బన్నీ వాసు ప్రొడ్యూసర్ కాగా, ఎస్ కేఎన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తు్న్నారు. సత్యరాజ్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, సప్తగిరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూలై1న విడుదల చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించారు మేకర్స్. స్టైలిష్ లుక్ లో గోపీచంద్ కనబడుతున్నారు.

మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ మూడో చిత్రం ‘రంగరంగ వైభవంగా’ కూడా అదే రోజున అనగా జూలై 1న విడుదల కానుంది. అలా బాక్సాఫీసు వద్ద ఈ రెండు చిత్రాలు పోటీ పడనున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.. అయితే, గోపీచంద్ నటిస్తున్న చిత్రాలు గత కొంత కాలం నుంచి అనుకున్న స్థాయిలో ఆడటం లేదు.

‘జిల్’ చిత్రం నుంచి మొదలుకుని ‘ఆరడుగుల బుల్లెట్’ వరకు విడుదలైన సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొడుతున్నాయి. ‘సీటీమార్’ ఫిల్మ్ కొంత మేరకు బాగానే ఆడింది. కాగా, సరైన విజయాన్ని తన ఖాతాలో గోపీచంద్ నమోదు చేసుకోలేదు. ఈ నేపథ్యంలో ‘పక్కా కమర్షియల్’పైనే ఆయన ఆశలు పెట్టుకున్నట్లు వినికిడి.

Read more RELATED
Recommended to you

Exit mobile version