బాక్సాఫీస్ కా బాప్ ఈ సినిమా.. బడ్జెట్ రూ.6 లక్షలు.. కలెక్షన్స్​ రూ.800 కోట్లు

-

ఆ సినిమా బడ్జెట్ రూ.6 లక్షలు.. కానీ వసూళ్లు మాత్రం ఏకంగా రూ.800 కోట్లు. అంటే 13,30,300 శాతం లాభాలు పొందింది అన్నమాట. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. అది హాలీవుడ్ మూవీ ‘పారానార్మల్ యాక్టివిటీ’.  2007లో.. తక్కువ బడ్జెట్​లో తెరకెక్కి.. ప్రపంచవ్యాప్తంగా అసాధారణ రీతిలో కలెక్షన్లు వసూల్​ చేసింది. ఈ సినిమా బడ్జెట్.. అప్పట్లో 15000 (అప్పటి డాలర్ రేటు ప్రకారం.. సుమారు రూ. 6 లక్షలు) డాలర్లు.

అయితే పారామౌంట్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థ.. ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసి.. క్లైమాక్స్​ను మార్చారు. ఈ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అదనంగా మూవీమేకర్స్.. 2,15,000 (రూ. 96 లక్షలు) డాలర్లు ఖర్చుచేసింది. అయితే ఇంత తక్కువ ఖర్చుతో రూపొందిన ఈ సినిమా.. థియేటర్లలో రిలీజై 193 మిలియన్ డాలర్లు ( సుమారు రూ. 800 కోట్లు ) వసూల్ చేసింది. దీంతో ‘పారానార్మల్ యాక్టివిటీ’ సినీ పరిశ్రమ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news