వర్షం సినిమా వెనుక చాలా పెద్ద కథ ఉందే..!

-

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరియర్ లో మొదటి సూపర్ హిట్ మూవీ వర్షం. మొదటి సినిమా ఈశ్వర్ పర్వాలేదు అనిపించగా ఆ తర్వాత వచ్చిన రాఘవేంద్ర ప్రభాస్ కు ఫ్లాప్ ఇచ్చింది. ఇక ఆ తర్వాత వచ్చిన సినిమా వర్షం. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ లో వచ్చిన వర్షం సినిమాను శోభన్ డైరెక్ట్ చేశాడు. ఆ సినిమాకు కథ అందించింది వీరు పోట్ల. రచయితగా వీరు పోట్లకు మంచి గుర్తింపు తెచ్చిన సినిమా అది. సినిమా మొత్తం వరంగల్ బ్యాక్ డ్రాప్ తో సాగుతుంది. అయితే ఈ సినిమా కథను వీరు పోట్ల ముందు రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో రాసుకున్నాడట.

ఈ కథను పరుచూసి సోదరుల దగ్గరకు తీసుకెళ్లగా రాయలసీమ కన్న వరంగల్ వేయి స్థంబాల గుడి నేపథ్యంలో ఓ లవ్ స్టోరీగా చెబితే బాగుంటుందని సలహా ఇచ్చారట. ఆ ఐడియా నచ్చడంతో వీరు పోట్ల అలానే వరంగల్ బ్యాక్ డ్రాప్ లో కథ రాయడం అలా రాయలసీమలో అనుకున్న సినిమా కాస్త వరంగల్ కు షిఫ్ట్ అవడం జరిగిందట. ప్రభాస్ సరసన త్రిష జంటగా నటించిన ఆ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ సాధించింది. ఈ సినిమా గురించి మరో సర్ ప్రైజ్ న్యూస్ ఏంటంటే ఈ కథను శోభన్ ముందు మహేష్ కు వినిపించాడట. అయితే అప్పటికే శోభన్ డైరక్షన్ లో బాబి సినిమా చేసిన మహేష్ ఆ సినిమాతో ఫ్లాప్ చవిచూశాడు. అందుకే వర్షం వదులుకున్నాడు. కాని అది ప్రభాస్ కెరియర్ కు ఎంతో హెల్ప్ అయ్యింది.

పరుచూరి పలుకులు అంటూ పరుచూరి గోపాల కృష్ణ గారు వారి కెరియర్ లో జరిగిన ఇంట్రెస్టింగ్ విషయాల గురించి చెబుతూ వర్షం సినిమా వెనుక జరిగిన ఈ కథను వెళ్లడించారు. వీరు పోట్ల బిందాస్ సినిమాతో దర్శకుడిగా మారాడు. ప్రస్తుతం ఆయన ఓ ప్రయోగాత్మక కథతో వస్తున్నాడని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version