ముచ్చ‌ట‌గా మూసారి క‌లుస్తున్న స్టార్ కాంబో.. మ్యాజిక్ రిపీట్ చేస్తారా!

త్రివిక్ర‌మ్ అంటే పేరు కాదు. అదో బ్రాండ్ అని ఆయ‌న అభిమానులు, టాలీవుడ్ స్టార్లు సైతం పిలుచుకుంటారు. మ‌రి త్రివిక్ర‌మ్ మాట‌లు, డైలాగులు అంత మాయ చేస్తాయి. ఆయ‌న సినిమా వ‌స్తుందంటే.. అందులో డైలాగులు ఎలా ఉంటాయో అని అంతా ఎదురుచూస్తారు. పాత చింత‌కాయ డైలాగులు కాకుండా.. ఎప్పుడూ కొత్త కొత్త డైలాగుల‌తో అభిమానుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తారు గురూజీ. ఇక ఎప్పుడూ పెద్ద హీరోల‌తో వ‌రుస‌గా సినిమాలు చేసే ఆయ‌న ఇప్పుడు మ‌రో స్టార్ ను లైన్ లో పెట్టేశారు.

అలా వైకుంఠ‌పురం సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న త్రివిక్ర‌మ్‌.. ఇప్పుడు టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబును లైన్ లో పెట్టేశారు. సినిమా కూడా మొన్న‌నే క‌న్ఫ‌ర్మ్ అయింది. అయితే కొవిడ్ కార‌ణంగా షూటింగ్ ఇంకా మొద‌లు కాలేదు. అయితే ఇంత‌లోనే ఇప్పుడు మ‌రో స్టార్ హీరోను గురూజీ లైన్ లో పెట్టార‌ని తెలుస్తోంది.
త‌న‌కు క‌లిసొచ్చిన ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తో త‌ర్వాత సినిమాను చేయాల‌ని చూస్తున్నారు గురూజీ. ప‌వ‌న్ ప్ర‌స్తుతం హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే దీని త‌ర్వాత గురూజీతో మూవీ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇందుకోసం ఇప్ప‌టికే ఓ క‌థ‌ను రెడీ చేశాడ‌ట త్రివిక్ర‌మ్‌. అయితే ప‌వ‌న్ తో కోబ‌లి స్క్రిప్ట్ చేస్తార‌ని స‌మాచారం. ఇక ఈ మూవీని హారిక బ్యాన‌ర్ లోనే తెర‌కెక్కించ‌నున్న‌ట్టు స‌మాచారం.