త్రివిక్రమ్ భార్య డ్యాన్స్ అతిథిగా పవర్ స్టార్

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ భార్య సౌజన్య శ్రీనివాస్ క్లాసికల్ డ్యాన్సర్ షో లో పాల్గొన‌నున్నారు. ‘మీనాక్షి కళ్యాణం’ అనే క్లాసికల్ డ్యాన్స్ షోలో డ్యాన్స్ చేయడానికి సౌజ‌న్య శ్రీ‌నివాస్ సిద్ధంగా ఉంది. ఈ క్లాసిక‌ల్ డాన్స్ ప్రదర్శనకు పసుమర్తి రామలింగ శాస్త్రి దర్శకత్వం వహించారు. ఈ నెల 17న సాయంత్రం 6 గంటల‌కు హైద‌రాబాద్ లోని శిల్పకళా వేదికలో ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. ఈ డ్యాన్స్ షో ను హారిక అండ్ హాసిని ప్రొడక్షన్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఈ డ్యాన్స్ షో కు సంబంధించిన‌ సౌజన్య శ్రీనివాస్ పోస్టర్‌ను తాజా గా విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఫీనిక్స్ ఫరెవర్, సాయి సూర్య డెవలపర్స్ స్పాన్సర్ చేస్తున్న అనిందిత మీడియా ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. అయితే ఈ డ్యాన్స్ షో కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అలాగే గౌరవ అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ వ‌స్తున్నారు. వీరి తో పాటు న‌టుడు తనికెళ్ల భరణి, వసంత లక్ష్మీ నరసింహాచారి, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు రాబోతున్నారు.

Pawan Kalyan as chief guest for Trivikram’s wife Dance Programme