ప‌వ‌న్ డిజాస్టర్ మూవీ.. అక్క‌డ మాత్రం సూప‌ర్ హిట్‌..

-

మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప‌వ‌ర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా 2018 లో సంక్రాంతికి `అజ్ఞాతవాసి` చిత్రం విడుద‌ల అయింది. ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా న‌టించారు. విడుదలకు ముందే ఎన్నో సంచలనాలకు వేదికగా నిలిచిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద తొలి రోజు మంచి క‌లెక్షన్స్‌ను సాధించినా డిజాస్టర్ సినిమాగానే మిగిలింది.

బాక్సాఫీస్ వ‌ద్ద రాణించ‌లేక‌పోయిన ఈ చిత్రం యూ ట్యూబ్‌లో మాత్రం సెన్సేష‌న్‌ను క్రియేట్ చేస్తోంది. అజ్ఞాతవాసి సినిమాను హిందీ భాషలో డబ్బింగ్ చేసి ఆ సినిమాకు `ఎవడు 3` అనే టైటిల్‌తో యూ ట్యూబ్‌లో విడుద‌ల చేశారు. అయితే ఈ సినిమా యూట్యూబ్ లో 100 మిలియన్ల వ్యూస్ సాధించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హిందీ డబ్బింగ్ సినిమాల్లో 100 మిలియన్ల వ్యూస్ అందుకున్న తొలి సినిమాగా అజ్ఞాతవాసి రికార్డు క్రియేట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news