అన్న‌పైనే అఖిల ప్రియ యుద్ధం..

-

మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ‌.. ఇప్పుడు అన్న‌తో పోరుకు సై అంటుందా.. అన్న పెట్టిన రాజ‌కీయ బిక్ష‌తో ఎమ్మెల్యేగా ఎన్నికైన అఖిల ప్రియ అదే అన్నతో రాజ‌కీయంగా ఢీ కొట్టెందుకు సిద్ద‌మైందా.. అందుకు రాజ‌కీయంగా అఖిల ప్రియ అన్న‌తో ఢి అంటే ఢీ అనేందుకు వేధిక దొరికిందా.. అంటే అవున‌నే అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు. ఇంత‌కు మాజీ మంత్రి అఖిల ప్రియ ఢీ అనేది ఏ అన్న‌తో.. ఇంత‌కు ఆమేకు రాజ‌కీయ బిక్ష‌పెట్టిన అన్న ఎవ‌రు… మ‌రి రాజ‌కీయ బిక్ష‌పెట్టిన అన్న‌తోనే పోరాడేందుకు ఎందుకు సిద్ద‌మైంద‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది..

భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల త‌న‌య అఖిల ప్రియ‌. వైసీపీ పార్టీలో ఓ వెలుగు వెలిగిన శోభానాగిరెడ్డి అనుకోకుండా రోడ్డు ప్ర‌మాదంలో మృత్యువాత ప‌డింది. దీంతో ఆమే కుటుంబం ప‌రిస్థితి రాజ‌కీయంగా తీవ్ర సంక్షోభంలో ప‌డింది. శోభానాగిరెడ్డి చ‌నిపోవ‌డంతో న‌మ్ముకున్న వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ కుటుంబానికి అన్న‌గా మారి, కుటుంబానికి వెన్నుద‌న్నుగా నిల‌చి ఆమే కూతురు అఖిల ప్రియ‌ను ఎమ్మెల్యేను చేశాడు. అయితే వెన్నుద‌న్నుగా ఉన్న వైఎస్ జ‌గ‌న్‌కు శోభానాగిరెడ్డి భ‌ర్త నాగిరెడ్డి వెన్నుపోటు పొడిచి టీడీపీ పంచ‌న చేరాడు.

అయితే నాగిరెడ్డి మంత్రిప‌ద‌వికి ఆశ‌ప‌డి టీడీపీలో చేరితే చంద్ర‌బాబు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌క‌పోవ‌డంతో మ‌న‌స్థాపంకు గురై త‌రువాత ఆయ‌న మృతి చెందాడ‌నే అప‌వాదు లేక‌పోలేదు. అయితే నాగిరెడ్డి చనిపోవ‌డంతో రాజ‌కీయ విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో చంద్రబాబు అఖిల ప్రియ‌ను మంత్రిని చేశాడు. అయితే ఆమే మొన్న‌టి ఎన్నిక‌ల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. అన్న‌గా పిలుచుకునే జ‌గ‌న్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి, అదే జ‌గ‌న్ పార్టీ నేత చేతిలోనే ఓడిపోయింది అఖిల ప్రియ‌.. అటు త‌ల్లిదండ్రులు లేక‌పోవ‌డంతో రాజ‌కీయ నిర్ధేశం చేసే వారు లేఖ‌పోవ‌డంతో అఖిల ప్రియ రాజ‌కీయంగా ఇక్క‌ట్లు ఎదుర్కొంటుంది.

అన్న జ‌గ‌న్ బ్ర‌హ్మండ‌మైన మెజారిటీతో గెలిచి స‌ర్కారు చేప‌ట్టిన త‌రుణంలో మ‌ళ్ళీ అఖిల ప్రియ అన్న చెంత‌కు చేరుతుంద‌నే ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఎందుకో అన్న చెంత‌కు చేర‌కుండానే బీజేపీ నేత‌ల‌తో మంత‌నాలు జ‌రిపింది. అటు అన్న పార్టీలో చేర‌కుండా ఇటు బీజేపీలో చేర‌కుండా ప్ర‌స్తుతం టీడీపీలోనే కొన‌సాగుతుంది. అయితే ఇప్పుడు అదే రాజ‌కీయంగా అండ‌దండ అందించిన అన్న‌తోనే ఢీకొట్టెందుకు సిద్ధ‌మైట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఆమే తీసుకుంటున్న నిర్ణ‌యాలు కూడా అందుకు ఊత‌మిచ్చెలా ఉన్నాయి. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం యాదవాడలో యురేనియం నిక్షేపాల గుర్తింపు కోసం సర్వే చేస్తున్నారు.

ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి అఖిలప్రియ అక్కడికి చేరుకొని రైతులకు సమాచారం ఇవ్వకుండా పొలాల్లో సర్వే చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి ఉందని బుకాయించిన సర్వే సంస్థ ప్రతినిధులు, తమకేమీ తెలియదని, అనుమతి ఇవ్వలేదని తప్పించుకోబోయిన అధికారులపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యురేనియం త‌వ్వ‌కాలు జ‌రిపితే పోరాటం చేస్తామంటున్న అఖిల ప్రియ ప‌రోక్షంగా అన్న జ‌గ‌న్‌తోనే పోరాటం చేసేందుకు సిద్ద‌మైన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రి అఖిల ప్రియ అన్న‌తో ప్ర‌త్య‌క్షంగా పోరాటం చేస్తుందో.. లేదో వేచి చూడాల్సిందే..

Read more RELATED
Recommended to you

Latest news