Vakeel Saab : పవర్‌ స్టార్‌ పవర్‌ లుక్‌.. PSPK26 ఫస్ట్‌లుక్‌ విడుదల

-

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పింక్ రీమేక్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మాతలుగా వేణు శ్రీరాం దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే మొదటి షెడ్యుల్ కూడా పూర్తి చేసుకుంది. పవన్ కళ్యాణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ సగానికి పైగా పూర్తి అయినట్టు తెలుస్తుంది.

ఇక ఈ సినిమా లుక్ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా వచ్చి దాదాపు రెండేళ్ళు అవుతుంది. దీనితో ఈ సినిమాపై అందరిలోనూ ఉత్కంట నెలకొంది. ఈ సినిమాకు సంబంధించి ఏ వార్త వచ్చినా సరే పవన్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

తాజాగా ముందు చెప్పిన మాట ప్రకారం ఈ సినిమా లుక్ ని విడుదల చేసారు. దీనితో ఈ పిక్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే దుమ్ము రేపుతుంది. ఈ హడావుడి చూస్తుంటే సినిమా రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనపడుతుంది. ఈ సినిమా టైటిల్ కూడా రివీల్ చేసింది చిత్ర యూనిట్. పింక్ సినిమాలో అమితాబ్ పోషించిన లాయర్ పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారు. ఈ సినిమా దాదాపు వేసవిలో విడుదల అయ్యే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news