మంగళసూత్రానికి రెండు బంగారు బిళ్లలు ఎందుకు ఉంటాయో తెలుసా?

-

రెండూ రెండు కళ్లతో సమానమని అర్థం. మనం మన రెండు కళ్లను ఎంత బాగా చూసుకుంటామో… మహిళ పుట్టినిల్లు, మెట్టినిల్లును అలాగే చూసుకోవాలని.. వాటిని మరిచిపోవద్దని.. తాళిలో పెడతారు.

మీకు పెళ్లయిందా? మీరు మగ అయితే.. పెళ్లిలో మీ భార్యకు తాళి కట్టినప్పుడు ఒకసారి తాళిని పరిశీలించారా? ఆ తాళికి రెండు బంగారు బిళ్లలు ఉంటాయి. మీరు ఆడ అయితే.. మీ భర్త మీకు కట్టిన తాళిని ఒకసారి చెక్ చేసుకోండి. రెండు బంగారు బిళ్లలు ఉంటాయి ఆ తాళికి. దాని మర్మం ఏంటి. రెండు ఎందుకు ఉంటాయి. ఎప్పుడైనా ఆలోచించారా?

అయితే చాలామంది తాళిని మంగళసూత్రం అని కూడా అంటారు. బంగారంతో చేసిన బిళ్లలను కూడా మంగళసూత్రం అని అంటారు. పుస్తె, తాళి, తాళిబొట్టు.. ఏ పేరుతో పిలిచినా.. ఒకటే.

తాళికి కచ్చితంగా ముత్యాలు, నల్లపూసలు, పగడాలు మొదలైన వాటితో తయారు చేస్తారు. వాటితో పాటు రెండు బంగారు బిళ్లలు ఉంటాయి. అవి ఒకటి పుట్టింటిని.. మరొకటి అత్తగారింటిని సూచిస్తుంది. అంటే.. పెళ్లయిన మహిళకు పుట్టినిల్లు, మెట్టినిల్లు.. రెండూ రెండు కళ్లతో సమానమని అర్థం. మనం మన రెండు కళ్లను ఎంత బాగా చూసుకుంటామో… మహిళ పుట్టినిల్లు, మెట్టినిల్లును అలాగే చూసుకోవాలని.. వాటిని మరిచిపోవద్దని.. తాళిలో పెడతారు. వాటిని చూసినప్పుడల్లా పుట్టినిల్లు, మెట్టినిల్లు గుర్తుకు రావాలనేది కూడా మరో కారణం. ఆ రెండు బంగారు బిల్లలు మహిళ తాళిని ధరించినప్పుడు తన గుండెల మీద ఉంటాయి. అంటే పుట్టినిల్లు, మెట్టినిల్లు.. రెండూ తన గుండెల్లో ఉండాలనేది కూడా మరో కారణం అని పురాణాలు చెబుతుంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news