పవన్ రెమ్యునరేషన్ ఏంటి ఈ రేంజ్ లో ఉంది…?

-

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ కి టాలివుడ్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉండటంతో సినిమాకు మార్కెట్ కూడా భారీగా ఉంటుంది. పవన్ సినిమా టాలివుడ్ లో వచ్చి రెండేళ్ళు అవుతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన లాయర్ సాబ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన 25 రోజులు సమయం కేటాయించారు.

ఈ సినిమా పూర్తి కాకుండానే పవన్ కళ్యాణ్ ఇటీవల క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా మొదలుపెట్టారు. దీనికి తోడు ఏఎం రత్నం కూడా పవన్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీనితో పవన్ కళ్యాణ్ భారీగా పారితోషకం పెంచేసినట్టు తెలుస్తుంది. దిల్ రాజు, బొనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఆయన 50 కోట్ల వరకు తీసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి.

అయితే అది షేర్ రూపంలో తీసుకుంటున్నారని అంటున్నారు. పవన్ సినిమా అంటే ఆ హక్కులు ఈ హక్కులు వసూళ్లు అంటూ 150 కోట్ల వరకు మార్కెట్ ఉంటుంది. సినిమా ఫ్లాప్ అయినా సరే తొలి రెండు రోజుల్లోనే వసూళ్ల రూపంలో పెట్టుబడి లాభం వచ్చేస్తాయి. దీనితో ఇప్పుడు పవన్ కోసం అడిగిన మొత్తం ఇవ్వడానికి దర్శక నిర్మాతలు ముందుకి వస్తునట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news