లక్ష్మీనారాయణ రాజీనామాపై టీడీపీ నేత సోమిరెడ్డి హాట్ కామెంట్స్‌..!

-

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీకి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. పవన్ కల్యాణ్ మళ్లీ సినిమా రంగంలోకి వెళ్లడమే తన రాజీనామాకు కారణమని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. అయితే జనసేన నేతగా గడచిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీ నారాయణ, నిన్న జనసేన పార్టీకి రాజీనామా చేయగా, పలువురు నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా దీనిపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.

“లక్ష్మీ నారాయణ గారూ, ఎన్టీఆర్, ఎంజీఆర్ లాంటి వాళ్లే రాజకీయాల్లోకి వచ్చాక కూడా కొన్ని సినిమాల్లో నటించడం చూశాం. పవన్ కల్యాణ్ ఒకటి, రెండు సినిమాల్లో నటిస్తే రాష్ట్రానికొచ్చిన నష్టమేం లేదు. కానీ… రాజకీయ నాయకులు నిజ జీవితంలో నటిస్తేనే ప్రజాస్వామ్యానికి ప్రమాదం“ అని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news