యాక్షన్ మోడ్​లో పవర్ స్టార్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కొత్త పోస్టర్ అదుర్స్​

-

ఓవైపు రాజకీయాలు.. మరోవైపు సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇక త్వరలో తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తన చేతిలో ఉన్న సినిమా షూటింగులన్నీ వీలైనంత త్వరగా పూర్తి చేసుకుని రాజకీయాలపై పూర్తిగా దృష్టి సారించాలని నిర్ణయించాడు. అందుకే షూటింగుల్లో బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. వాటిలో ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలు షూటింగ్ దశలో ఉన్నాయి.

ఇప్పుడు తాజాగా ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ వచ్చింది. పవన్ కల్యాణ్​ ఈ సినిమా షూటింగ్​ సెట్‌లోకి అడుగుపెట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ ఓ సరికొత్త పోస్టర్​ను రిలీజ్ చేసింది. పవన్​ యాక్షన్ మోడ్​లోకి వెళ్లిపోయినట్లు ట్వీట్ చేసింది. పవన్​పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని తెలిపింది. పోస్టర్​లో పవన్​లో గన్‌ పట్టుకుని స్టైలిష్‌గా కూర్చొని సూపర్​గా కనిపించాడు. ‘ది ఉస్తాద్‌ ఈజ్‌ ఇన్‌ యాక్షన్‌’ అని మూవీటీమ్​ ఓ క్యాప్షన్ రాసుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news