“వైసిపిని మళ్లీ గెలిపిస్తే రాష్ట్రం అధోగతి పాలు”

-

ఆంధ్రప్రదేశ్ లో పాలనలో ఉన్న వైసీపీ పై అన్ని పార్టీలు గుర్రుగా ఉన్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన, సిపిఎం సిపిఐ లు మరియు ఇతర స్థానిక పార్టీలు ఎలాగైనా వైసీపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు నడుస్తున్నాయి. ఇక తాజాగా సిపిఐ కు చెందిన రామకృష్ణ ఏపీ గురించి మాట్లాడుతూ వైసీపీ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. రాష్ట్రంలో ప్రభుత్వం నియంతృత్వ చర్యలపైనే వీలైనంత త్వరలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తామని మీడియా సమావేశంలో తెలిపారు. ఇక తాజాగా లోకేష్ ఉండగా జరిగిన అంగళ్ళు ఘటన మరియు చంద్రబాబు పర్యటనలో జరిగిన పుంగనూరు ఘటనలకు వైసీపీ కారణం అంటూ రామకృష్ణ మాట్లాడారు. ఈ ప్రభుత్వం ప్రతిపక్షాలు నిర్వహించే మీటింగ్ లకు భంగం కలిగించడం మరియు అనుమతులు ఇవ్వకపోవడం దుశ్చర్య అంటూ మండిపడ్డారు రామకృష్ణ. ఇంకా ప్రభుత్వం పాలనను ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం మరియు జైళ్లకు పంపించడం లాంటివి వైసీపీకి తగదని రామకృష్ణ దుయ్యబట్టారు.

వచ్చే ఎన్నికల్లో మళ్ళీ వైసీపీని ఈ ప్రజలు గెలిపిస్తే ఒక రాష్ట్రము సంగతి మరిచిపోవడం మేలు అంటూ సెటైరికల్ గా మాట్లాడారు సిపిఐ నేత రామకృష్ణ.

Read more RELATED
Recommended to you

Latest news