నిర్మాతకి పవన్ కళ్యాణ్ వార్నింగ్ … అసలేమైందంటే ..?

-

అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాను రానంటూనే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఒకవైపు రాజకీయాలు మరో వైపు సినిమాలు ఏక కాలంలో చేస్తున్నాడు. సంక్రాంతి తర్వాత సడన్ గా పింక్ సినిమా రీమేక్ సెట్ లో ప్రత్యక్షమయ్యి అందరికీ షాకిచ్చాడు పవన్ కళ్యాణ్. గుబురు గడ్డంతో ఉన్న సీన్స్ ని ముందు తెరకెక్కించిన డైరెక్టర్ ఆ తర్వాత క్లీన్ షేవ్ తో చిత్రీకరణలో పాల్గొన్నారు. ఈ సినిమాకి లాయర్ సాబ్, వకీల్ సాబ్ అన్న టైటిల్స్ ని అనుకుంటున్నారట చిత్ర బృందం. అయితే అఫీషియల్ గా ఇంకా ఏదన్నది ప్రకటించలేదు.

 

ఇక ఈ సినిమాతో పాటే ఏ.ఎం.రత్నం నిర్మాతగా జాగర్ల మూడి రాధా కృష్ణ (క్రిష్) దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు పవన్. ఈ సినిమా ప్రస్తుతం ఒక షెడ్యూల్ కంప్లీటయిందని సమాచారం. పీరియాడికల్ మూవీగా ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా పవన్ సరసన నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నప్పటికి ఇంకా చిత్ర యూనిట్ నుండి ఎలాంటి అధికారకమైన ప్రకటన వెలువడలేదు.

 

అయితే ఈ సినిమా వీలైంత త్వరగా కంప్లీట్ చేసి నెక్స్ట్ సినిమాకి డేట్స్ సర్ధుబాటు చేయాలని పవన్ ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తాడని ఫిల్మ్ నగర్ లో న్యూస్ బాగా వైరల్ అవుతోంది. ఈ కాంబినేషన్ లో ఇది వరకే గబ్బర్ సింగ్ వచ్చి బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. దాంతో హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ కాంబో అనగానే అంచనాలు భారీగా మొదలైయ్యాయి. ఇదిలా ఉంటే రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ నిర్మాతకి చిన్న ఆర్డర్ వేసినట్టుగా తెలుస్తోంది. షూటింగ్ లో పవన్ ఉన్నంత సేపు ఆ నిర్మాత ఉండాలని గట్టిగా చెప్పాడట. మరి అలా ఎందుకు చెప్పాడో అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version