పాయల్ రాజ్ పుత్.. ఆర్ఎక్స్ 100 ద్వారా మొదటిసారి తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాలోనే చాలా ఘాటుగా నటించి అందరి మన్ననలు పొందింది. మొదటిసారి హీరోయిన్ అయి ఉండి విలన్ గా నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందనే చెప్పాలి. ఇక తర్వాత రెండు మూడు సినిమాలలో ఈమె నటించినప్పటికీ పెద్దగా ఈమెకు వర్కౌట్ కాలేదని చెప్పాలి. ఇక స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కాలం కలిసి రాక సోషల్ మీడియా ద్వారా మరింత పాపులారిటీని సంపాదించుకుంది.ఇకపోతే పాయల్ ఎక్కువగా సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ ఏకంగా ఎద అందాలను కూడా విప్పి అభిమానులను ఆకట్టుకుంటుంది. ఒకరకంగా చెప్పాలి అంటే ఈమె గ్లామర్ ఫోటోషూట్లతో విపరీతంగా క్రేజ్ ను సంపాదించుకుంది. అంతేకాదు పలు రకాలుగా థైస్ అందాలను చూపిస్తూ సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తూ మరింత పాపులారిటీని సంపాదించుకున్న ఈమె అవకాశాలు లేక హీరోయిన్ పాత్రల కోసం తెగ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈమెకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.
పాయల్ వద్దకు ఎవరైనా సినిమాలలో అవకాశాలు ఇవ్వాలనుకుంటే ముందుగా దర్శక నిర్మాతలకు ఈమె చెప్పే కండిషన్స్ కు ఒప్పుకుంటేనే ఆమె సినిమాలలో నటిస్తుందట. ఇక ఏమిటా కండిషన్ అనే విషయానికి వస్తే ఈమె లిప్ కిస్ లు, బెడ్ సీన్లలో నటించడమే కాదు ఎడ అందాలను ఎక్స్పోజ్ చేయాలి అంటే ముందుగా ఈమెకు ఇచ్చే పారితోషకంతో పాటు అదనంగా 50 లక్షల రూపాయలను అదనంగా ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తుంది. అంతే కాదు తన డిమాండ్ కి అంగీకరిస్తేనే తనను సంప్రదించాలనే కండిషన్ కూడా పెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే అసలు సినిమాలలో అవకాశాలు లేవు పైగా ఇలాంటి కండిషన్స్ పెడుతూ ఉంటే ఇక ఈమెకు అవకాశాలు ఎవరిస్తారు అంటూ రకరకాలుగా పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.