తెలంగాణలో మలి ఉద్యమం రాబోతుంది – రాజగోపాల్ రెడ్డి

-

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో వీఆర్ఏల నిరవధిక సమ్మెకు సంఘీభావం తెలిపారు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 23 వేల మంది వీఆర్ఏలు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తుంటే కెసిఆర్ కు కళ్ళు మూసుకుపోయాయా? అంటూ ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులకుప్పగా కెసిఆర్ మార్చాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరు మీద ఆంధ్ర కాంట్రాక్టర్లకు లక్షల కోట్లు కట్టబెట్టారని అన్నారు.

2014లో కేసీఆర్ కొడుక్కి, బిడ్డకి ఒక ఇల్లు కూడా లేదు.. ఇప్పుడు లక్ష కోట్లకు పడగలెత్తారని అన్నారు రాజగోపాల్ రెడ్డి. రాష్ట్రంలో కొన్ని కోట్లు ఖర్చుపెట్టి రైతువేదికలు నిర్మించారు అవి ఇప్పుడు నిరుపయోగంగా మారాయన్నారు. చౌటుప్పల్ వరదలతో మునిగిపోతుంటే సిద్దిపేట ,సిరిసిల్లలో అభివృద్ధి చేస్తున్నారు దీనిని సమానత్వం అంటారా? అని ప్రశ్నించారు. కెసిఆర్ నియంత పాలనకు మునుగోడు నుండే ప్రజలు చరమగీతం పాడుతారని అన్నారు రాజగోపాల్ రెడ్డి. తెలంగాణలో మలి ఉద్యమం రాబోతుంది.. కేసీఆర్ కుటుంబానికి ,తెలంగాణ ప్రజలకు మధ్య ఉద్యమం ప్రారంభమయిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news