ర‌వితేజ మూవీలో పాయల్ రాజ్‌పుత్ ఐటెం సాంగ్

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో ఐటెం సాంగ్‌ల ట్రెండ్ న‌డుస్తుంది. స్టార్ హీరోలు త‌మ సినిమాలలో పెద్ద హీరోయిన్ ల‌తో ఐటెం సాంగ్ ల‌ను తీస్తున్నారు. ర‌వితేజ హీరోగా న‌క్కిన త్రినాథ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో ధ‌మాకా అనే సినిమా తెర‌కెక్కుతుంది. ఈ సినిమా లో హీరో ర‌వితేజ డ‌బుల్ రోల్ లో నటిస్తున్నాడు. ఈ ధ‌మాకా సినిమా లో మాస్ హీరో ర‌వితేజ ఐటెం సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారు. ఈ ఐటెం సాంగ్ లో ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయ‌ల్ రాజ్ పుత్ ను ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది.

కాగ ఈ ఐటెం సాంగ్ లో మొద‌ట యాంక‌ర్ అన‌సూయను, త‌ర్వాత ఈషా రెబ్బ ను ఎంపిక చేస్తున్న‌ట్టు వార్తలు వ‌చ్చాయి. కానీ చివ‌ర‌కు పాయ‌ల్ రాజ్ పుత్ ను చిత్ర యూనిట్ ఖ‌రారు చేసిన‌ట్టు తెలుస్తుంది. కాగ దీనికి ముందు ర‌వితేజతో పాయల్ రాజ్ పుత్ డిస్కో రాజా అనే సినిమా చేసింది. అయితే ఆ సినిమా అశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో ప్ర‌స్తుతం ధ‌మాకా సినిమా లోని ఐటెం సాంగ్ లో వీరి కాంబినేష‌న్ ఎంత వ‌ర‌కు స‌క్సస్ చేస్తుందో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.