తెలంగాణ కరోనా బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమం…!

-

దేశాన్ని కరోనా వేరియంట్ వణికిస్తోంది. పలు రాష్ట్రాలకు సోకుతూ ప్రభుత్వాలను, ప్రజలను కలవరపెడుతోంది. ఇప్పటికే దేశంలో 150కి పైగా ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఓమిక్రాన్ గుబులు పుట్టిస్తోంది. ఇప్పటికే 20 వరకు కేసులు నమోదయ్యాయి. వీరంతా విదేశాల నుంచి వచ్చిన వారే. జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల్లో వీరందరికి ఓమిక్రాన్ సోకిందని తెలిసింది. అయితే తాజాగా తెలంగాణలో ఓ ఓమిక్రాన్ బాధితుడి ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. మెరుగైన వైద్యం కోసం ఆయన్ను హుటాహుటీగా టిమ్స్ నుంచి గాంధీ ఆసుపత్రికి అధికారులు తరలించారు. గచ్చిబౌలిలో చికిత్స పొందుతున్న క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

అయితే ఓమిక్రాన్ కేసుల్లో స్వల్ప లక్షణాలే ఉంటున్నాయని…మరణాలు లేవని అనుకుంటున్న సమయంలో బాధితుడి ఆరోగ్య పరిస్థితి విషమించడం ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల యూకేలో ఓమిక్రాన్ బాధితులు 7 గురు చనిపోయారు. ఇన్నాళ్లు ఓమిక్రాన్ తో మరణాలు సంభవించలేదని అనుకుంటున్న క్రమంలో బాధితులు మరణించడం ప్రపంచ దేశాలను కలవరపరుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news