Payal Rajput: పులుపు మామిడిపై బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ మోజు..ఏదైనా విశేషమా?

-

బ్యూటిఫుల్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్..RX 100 సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. బోల్డ్ రోల్స్ ప్లే చేయడంలో తాను ఎప్పుడు ముందుంటానని తొలి చిత్రంతోనే చెప్పకనే చెప్పేసింది ఈ అమ్మడు. ఈ ఢిల్లీ భామ ఆ తర్వాత కాలంలో తెలుగుతో పాటు ఇతర భాషల చిత్రాల్లో కథానాయికగా నటించడం షురూ చేసింది. అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ముందుకు దూసుకెళ్తోంది ఈ ముద్దుగుమ్మ.

తాజాగా ఈ భామ ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫొటోలు ప్రజెంట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతున్నాయి. బోల్డ్ పాప అప్పుడే ఏదేని విశేషం చెప్తుందా? అని సదరు ఫొటోలు చూసి నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మామిడి తోటలో పచ్చి పుల్లటి మామిడి కాయలను తెంపుతున్న ఫొటోలు షేర్ చేసింది ఈ సుందరి. దాంతో నెటిజన్లు ఆ విధంగా చర్చించుకుంటున్నారు.

పొట్టి గౌనులో చెట్టుపైనున్న పచ్చటి పుల్ల మామిడి కాయలను తెంపుతోంది పాయల్ రాజ్ పుత్. ఇక ఈ ఫొటోలు చూసి నెటిజన్లు వామ్మో ఈ భామ ఇలా మామిడి తోటల్లో తిరిగితే కుర్రకారు పరిస్థితేంటని అనుకుంటున్నారు. ఇటీవల స్లీవ్ లెస్ టాప్ ధరించి స్కిన్ షోతో అదరగొట్టిన ఈ సుందరి..తాజాగా మామిడి తోటల ఫొటోలతో సోషల్ మీడియాలో హైలైట్ అయింది. ప్రజెంట్ పాయల్ పాప ‘ఏంజెల్, కిరాతక, హెడ్ బష్, గోల్ మాల్ ’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది.

https://www.instagram.com/p/CcKiNX6I52L/

 

Read more RELATED
Recommended to you

Latest news