చరణ్ సినిమా రిజెక్ట్ చేసిందా..!

-

ఆరెక్స్ 100 సినిమాతో యూత్ ఆడియెన్స్ ను అలరించిన పాయల్ రాజ్ పుత్ ఒక్క సినిమాతో అమ్మడు పాపులర్ అయిపోయింది. పంజాబి భామ అయిన పాయల్ బాలీవుడ్ సీరియల్స్ నుండి టాలీవుడ్ కు ప్రమోట్ అయ్యింది. ఆరెక్స్ 100లో ప్రేక్షకులకు అందాల విందు కలిగించిన ఈ అమ్మడు తెలుగులో వచ్చిన ప్రతి అవకాశాన్ని కాదనేస్తుందట.

ఆరెక్స్ 100 తర్వాత అదే తరహా పాత్రలు వస్తుందని అమ్మడు వచ్చిన ప్రతి ఆఫర్ కాదన్న పాయల్ లేటెస్ట్ గా మెగా పవర్ స్టార్ రాం చరణ్ సినిమా ఛాన్స్ కూడా కాదన్నదని తెలుస్తుంది. బోయపాటి శ్రీను, చరణ్ సినిమాలో ఐటం సాంగ్ కోసం పాయల్ ను సంప్రదించారట. ఆరెక్స్ 100 తో బోల్డ్ ఇమేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు ఈ ఐటం సాంగ్ చేస్తే మరింత క్రేజీగా మారే అవకాశం ఉంది. కాని ఎందుకో అమ్మడు ఆ లక్కీ ఆఫర్ వద్దనేసిందట.

చరణ్ సినిమా రిజెక్ట్ చేసింది అంటే అమ్మడి ప్లాన్ వేరేలా ఉన్నట్టు ఉంది. అంతేకాదు బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ కూడా వదులుకున్న పాయల్ అఖిల్ సినిమాలో చిన్న పాత్రకు అడిగినా సారీ అనేసిందట. మరి వచ్చిన ప్రతి అవకాశాన్ని కాదంటున్న ఆరెక్స్ పాప తెలుగులో కెరియర్ కొనసాగించాలని అనుకుంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version