లియో డైరెక్టర్ పై మధురై కోర్టులో పిటిషన్

-

ప్రముఖ తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్పై మధురై కోర్టులో పిటిషన్ నమోదైంది. ఆయనకు మానసిక పరీక్షలు నిర్వహించాలని కోరుతూ ఓ వ్యక్తి కోర్టులో వాదనలు వినిపించారు. లోకేశ్ దర్శకత్వం వహించిన సినిమాలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని పిటిషన్లో పేర్కొన్న రాజా మురుగన్ అనే వ్యక్తి లోకేశ్ సినిమాలు ప్రజలపై మానసికంగా ప్రభావం చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

బుధవారం రోజున రాజా పిటిషన్పై మధురై కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా.. ఇటీవల విడుదలైన ‘లియో’ చిత్రంలో తీవ్రంగా హింస ఉందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఇలాంటి చిత్రాలకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చే ముందు సీబీఎఫ్సీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) మరింత జాగ్రత్తలు తీసుకునేలా ఆదేశించాలని న్యాయస్థానాన్ని ఆయన కోరారు.

లియోలో హింసను గొప్పగా చూపించారని రాజా ఆరిపంచారు. ఆ చిత్రంలోని క్యారెక్టర్లు ప్రభుత్వ ఏజెన్సీల అండతో అక్రమ కార్యకలాపాల్లో భాగమైనట్లు చూపించారని.. అలాంటి చిత్రాలు హానికరమైన ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. అధిక వేగంతో వెళ్లడం, పోలీసుల అండతో నేరాలు చేయడం, చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనడం తప్పు కాదు అనే భావన ప్రేక్షకుల్లో ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ సినిమాల ద్వారా సామాజిక విలువలను పెంచే బాధ్యత ఫిల్మ్ మేకర్లపై ఉంటుందన్న పిటిషన్.. లోకేశ్ కనగరాజ్పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాదులు ఎవరూ హాజరు కాని కారణంగా కోర్టు విచారణను వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news