పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ సినిమాకు దిల్లీ కోర్టులో ఊరట లభించింది. ఆ సినిమా విడుదలను నిలుపుదల చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను అడ్వకేట్ రాజ్ గౌరవ్ ఉపసంహరించుకున్నారు. ‘సినిమా విడుదల పోస్ట్ పోన్ అయింది. నేను అభ్యంతరం వ్యక్తం చేసిన వాటిపై చిత్ర యూనిట్ స్పందించింది. సినిమాలో అవసరమైన మార్పులు చేస్తున్నట్లు నాకు తెలిసింది. అందుకే ఇంజక్షన్ పిటిషన్ను వెనక్కు తీసుకుంటున్నాను’ అని పిటిషనర్ కోర్టుకు తెలిపినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే జడ్జి ఈ పిటిషన్ను కొట్టివేశారు.
అసలేం జరిగిందంటే.. ‘ఆదిపురుష్’ సినిమా విడుదలపై స్టే విధించాలని కోరుతూ గతేడాది దిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలైంది. రాముడు, హనుమంతుడిని తోలు పట్టీలు ధరించి అసమంజసమైన ధోరణిలో చూపించారని పిటిషనర్లు ఆరోపించారు. రావణుడ్ని కూడా తప్పుగా చూపించారని అందులో పేర్కొన్నారు. రామాయణ పురాణాన్ని వక్రీకరించారని ఆదిపురుష్ అడ్వకేట్ రాజ్ గౌరవ్ కోర్టులో పిటిషన్ వేశారు.