బాయ్‌ ఫ్రెండ్‌తో పూనమ్‌ పాండే నిశ్చితార్థం!

-

ప్రముఖ మోడల్​, నటి పూనమ్​ పాండే ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ వచ్చింది. ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్‌ సామ్‌ బాంబెతో పూనమ్‌ నిశ్చితార్థం జరిగింది. ఈ విషయం సోషల్ మీడియా వేదికగా పూనమ్ బాయ్‌ఫ్రెండ్‌ సామ్‌ బాంబె వారు రింగ్ లు మార్చుకున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.వీరిద్దరూ చాలా కాలం నుంచి డేటింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. పూనమ్​ పాండే ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఈ మధ్య లాక్ డౌన్ సమయంలో కూడా వార్తల్లో నిలిచింది.

కరోనా లాక్​డౌన్​ నిబంధనలను అతిక్రమించిన కారణంగా ప్రముఖ మోడల్​, నటి పూనమ్​ పాండేపై కేసు నమోదైంది. దేశవ్యాప్తంగా అమలులో ఉన్న నిబంధనలను అతిక్రమిస్తూ.. ముంబయిలోని మెరైన్​ డ్రైవ్​ ప్రాంతంలో కారులో చక్కర్లు కొడుతూ మెరైన్ పోలీసులకు చిక్కిందీ నటి. పూనమ్​.. గతంలో నటి శిల్పాశెట్టి భర్త రాజ్​కుంద్రాపై బొంబాయి హైకోర్టులో ఫిర్యాదు చేసింది. అయితే ఈ ఆరోపణలను కుంద్రా అతని సహచరుడు సౌరభ్ కుష్వా పాండే ఖండించారు. హైకోర్టు నుంచి తమకు ఎలాంటి నోటీసులు అందలేదని వారు తెలిపారు.

 

View this post on Instagram

 

We finally did it!

A post shared by Sam Bombay (@sambombay) on Jul 23, 2020 at 12:04am PDT

Read more RELATED
Recommended to you

Latest news