స్టార్ ఆన్ డిమాండ్.. పూజా హెగ్దె..!

-

పాతికేళ్లుగా స్టార్ హీరోగా కొనసాగే హీరోలు ఉండగా హీరోయిన్స్ కు మాత్రం అంత టైం పిరియడ్ ఉండదు. వారు పదేళ్లు కెరియర్ సాగించారంటే ఫేడవుట్ కు వచ్చేస్తారు. తెలుగులో హీరోయిన్స్ చాలా మంది ఉన్నా వారిలో క్లిక్ అయ్యే వారు మాత్రం తక్కువే. అందులో మొదటి సినిమాతోనే సూపర్ ఫాంలోకి వచ్చే భామలు కొందరు కాగా ఒకటి రెండు సినిమాలు చేసి హిట్టు కొట్టేవారు కొందరున్నారు.

వారిలో ప్రస్తుతం వరుస స్టార్ ఛాన్సులు అందుకుంటున్న భామ పూజా హెగ్దె వస్తుంది. ముకుంద సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్దె డిజే సినిమాతో హిట్ కొట్టింది. ఆ తర్వాత వరుస అవకాశాలను అందుకుంటుంది. లాస్ట్ ఇయర్ అరవింద సమేత సినిమాతో ఎన్.టి.ఆర్ తో జోడీ కట్టిన పూజా హెగ్దె మహేష్ మహర్షి, ప్రభాస్ జాన్ సినిమాల్లో కూడా నటిస్తుంది.

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టుగా పూజ హెగ్దె కూడా క్రేజ్ ఉన్నప్పుడే రెమ్యునరేషన్ కూడా పెంచేస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కు మొదటి ఆప్షన్ గా కనిపిస్తున్న పూజా హెగ్దె సినిమాకు కోటి 70 లక్షల దాకా డిమాండ్ చేస్తుందట. నిన్నటి దాకా కోటి తీసుకున్న ఈ అమ్మడు ప్రభాస్ జాన్ కోసం మరో 70 లక్షలు పెంచిందట. మహర్షి హిట్టైతే జాన్ తర్వాత చేసే సినిమాలకు అమ్మడి 2 కోట్లు డిమాండ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version