తల్లి కాబోతున్న పూర్ణ లేటెస్ట్ పిక్స్ చూశారా..ఎంత అందంగా ఉందో చూడండి !

-

సీనియర్ హీరోయిన్, ఇటీవల కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన పూర్ణ (Actress Poorna) తల్లికాబోతోంది. దుబాయ్‌కి చెందిన బిజినెస్‌మెన్ ఆసిఫ్ అలీని ఈ ఏడాది జూన్‌లో పూర్ణ వివాహం చేసుకుంది.

కొన్నాళ్ల పాటు ప్రేమలో ఉన్న ఇద్దరూ కుటుంబ సభ్యుల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. తాజాగా తాను ప్రగ్నెంట్ అంటూ యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులకి పూర్ణ తెలియజేసింది. పూర్ణ ఎంగేజ్మెంట్ రహస్యంగానే జరిగింది. ఆ తరువాతే ఆ నిశ్చితార్థం ఫోటోలు బయటకు వచ్చాయి.

తాను షనీష్ ఆసిఫ్ అలీని వివాహాం చేసుకోబోతోన్నట్టు, ఎంగేజ్మెంట్ జరిగిందంటూ పూర్ణ పోస్ట్ వేసింది. అయితే మధ్యలో ఈ ఇద్దరూ విడిపోయారంటూ గాసిప్స్ వచ్చాయి. నిశ్చితార్థం జరిగి ఇన్ని నెలలు అవుతున్నా ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదు.. విడిపోయారా? అంటూ రూమర్లు వచ్చాయి.

కానీ పూర్ణ మాత్రం దుబాయ్‌లో అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వారు పెళ్లి చేసుకున్నారు. త్వరలోనే తల్లి దండ్రులు కూడా కాబోతున్నారు. అయితే తాను ప్రగ్నెంట్ అంటూ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలిపిన పూర్ణ… తాజాగా తన పిక్స్‌ కూడా షేర్‌ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version