నిర్మాతగా రాబోతున్న బాహుబలి సోదరి …!

-

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ప్రస్తుతం యంగ్ హీరోల్లో సీనియర్ నటుడు ప్రభాస్. ఇప్పటికే కృష్ణంరాజు నట వారసుడిగా ఉప్పలపాటి కుటుంబం నుండి ప్రభాస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే ప్రభాస్ కృష్ణంరాజు సోదరుడు కుమారుడు. అలాగే కృష్ణంరాజుకు మొత్తం ముగ్గురు కుమార్తెలు. ఇందులో పెద్ద కుమార్తె అయిన ప్రసీద నిర్మాతగా సినీ పరిశ్రమలోకి అరంగ్రేటం చేయబోతోంది. ప్రభాస్ నటించబోతున్న తన 20 చిత్రమైన రాధే శ్యామ్ సినిమాకు సంబంధించిన నిర్మాతలలో వంశీ, ప్రమోద్ మాత్రమే కాకుండా ప్రసీద కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే ప్రమోద్ కూడా కృష్ణంరాజుకు దగ్గర బంధువే.

praseedha

అయితే ప్రసీద నిర్మాతగా కేవలం సినిమారంగంలోకి మాత్రమే కాకుండా మరోవైపు ఓటీటీ రంగంలోకి కూడా అడుగు పెట్టాలని ఆలోచన చేస్తుంది. ఇందుకోసం తన తండ్రి కృష్ణంరాజు, సోదరుడు ప్రభాస్ ఆమెకు అవసరమైన పూర్తి సహకారాన్ని అందిస్తున్నారని ఫిలిం వర్గాలలో గుసగుసలు వినపడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version