ఆమె బిగ్గెస్ట్ స్టార్ అంటూ.. కో-స్టార్​పై ప్రభాస్ ప్రశంసల జల్లు

-

ఆమె ఓ బిగ్గెస్ట్ స్టార్. ఆమె అంటే నాకు చాలా అభిమానం అని తన కో స్టార్ గురించి చెప్పుకొచ్చాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. అయితే ఆ కోస్టార్ ఎవరో కాదు బాలీవుడ్ దివా దీపికా పదుకొణె. ఈ ఇద్దరు కలిసి ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్​లో భాగంగా ప్రభాస్ ఓ ఇంటర్నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో హోస్ట్ దీపిక గురించి ప్రభాస్ అభిప్రాయం అడిగారు.

వెంటనే స్పందిస్తూ ప్రభాస్.. ‘‘దీపికా పదుకొణె చాలా అందంగా ఉంటుంది. అద్భుతమైన నటి. ఇప్పటికే ఆమె ప్రపంచవ్యాప్తంగా ఫేమస్‌ అయింది. ఆమె ‘కల్కి’ సెట్స్‌లోకి అడుగుపెట్టిన ప్రతిసారి అందరిలోనూ ఉత్సాహం వస్తుంది. ఆమెతో కలిసి నటించాలని ఎప్పటి నుంచో అనుకునేవాణ్ని. ఇప్పుడు కుదిరింది’’ అని అసలు సంగతి చెప్పుకొచ్చాడు.

ఇక సినిమా సంగతికి వస్తే.. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌ పతాకంపై భారీ బడ్జెట్‌తో నిర్మాత అశ్వనీదత్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news