టాలీవుడ్ హీరో ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా మారిపోయిన విషయం తెలిసిందే. బాహుబలి తర్వాత వరుసగా చేస్తున్న సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా. తాజాగా ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ రిలీజ్ అయ్యి మిశ్రమ స్పందనను దక్కించుకుంది. ఇక సలార్ మూవీ త్వరలోనే విడుదల కానుంది. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ప్రభాస్ త్వరలోనే నటించనున్న మరో పాన్ ఇండియా మూవీ ప్రాజెక్ట్ కె.. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను సైంటిఫిక్ కథాంశంతో తెరకెక్కించడానికి ప్లాన్ చేశాడు. ఈ సినిమాను ఏంటో ప్రతిష్టాత్మకంగా ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమా గురించి వైజయంతి మూవీ ఒక కీలక ప్రకటన చేసింది. అస్సలు.. ప్రాజెక్ట్ కె అంటే ఏమిటి ? ఏ విధంగా సినిమా ఉండనుంది ? సబ్జెక్టు ఏమిటి అన్న విషయాలను తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ రెవీల్ ను జులై 20వ తేదీన అమెరికాలోని సాంటియాగో లో కామిక్ కాన్ లో చూపిస్తాము అంటూ ప్రకటన చేసింది. దీనితో అందరూ ఇప్పుడు ఆయా డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు.