ఆ విష‌యంలో త‌గ్గేది లేదంటున్న ప్ర‌భాస్.. బాహుబ‌లిని మించి!

ప్ర‌భాస్ ఇప్పుడు నేష‌న‌ల్ స్టార్‌గా ఎదిగాడు. ఆయ‌న చేస్తున్న సినిమాలు అన్నీ ప్యాన్ ఇండియా మూవీలుగానే తెర‌కెక్కుతున్నాయి. అయితే ఇప్పుడు ఓంరౌత్ తో చేస్తున్న ఆదిపురుష్ విష‌యంలో రోజుకో అప్‌డేట్ వ‌స్తోంది. ఇప్ప‌టి దాకా ఇండియాస్ బిగ్గెస్ట్ వీఎఫ్ఎక్స్ సినిమాగా ప్ర‌భాస్ చేసిన బాహుబలి-2 సినిమా నిలిచింది. దర్శక ధీరుడు అయిన ఎస్ ఎస్ రాజమౌళి ఏకంగా 2500 లకు పైగా వీఎఫ్ ఎక్స్ షాట్స్ ఇందులో పొందుప‌రిచాడు.

 ప్ర‌భాస్

అయితే ఇప్పుడు ఆ రికార్డును మ‌ళ్లీ ప్ర‌భాస్ బ్రేక్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్పటి దాకా బాహుబ‌లి రేంజ్‌లో మరే సినిమా అన్ని వీఎఫ్ఎక్స్ షాట్స్ తీయ‌లేదు. అయితే ఇప్పుడు ప్ర‌భాస్ చేస్తున్న ఆదిపురుష్ దాన్ని బ్రేక్ చేసేందుకు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది.

బాహుబలి 2 ను మించి ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ షాట్లు ఉంటాయ‌ని స‌మాచారం. ఇందులో బాహుబ‌లి కంటే మూడు రెట్లు ఎక్కువ‌గా వీఎఫ్ఎక్స్ షాట్స్ ప్లాన్ చేస్తున్నారంట డైరెక్ట‌ర్‌. ఇది కూడా జాన‌ప‌ద నేప‌థ్యంలో వ‌స్తుండ‌టంతో ఇందులో భారీగానే ఈ షాట్లు ఉంటాయి. ఇక ఆదిపురుష్ సినిమా విజువల్ వండర్ గా తెర‌కెక్కిస్తున్నారంట‌. ఎక్కువ‌గా 90 శాతం దాకా ఈ వీఎఫ్ఎక్స్ షాట్లు ఉంటాయని తెలుస్తోంది. ఎంతైనా ప్ర‌భాస్ మ‌రో స్థాయి సినిమా చేస్తున్నాడనే చెప్పాలి.