టీఆర్ఎస్ లోకి ఎల్ రమణ.. ముహూర్తం ఖరారు !

ఈటల ఎపిసోడ్ తో కరీంనగర్ రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. పార్టీలతో సహ తెలంగాణ ప్రజలు కరీంనగర్ రాజకీయాలపై ప్రస్తుతం దృష్టి సారించారు. అటు టిఆర్ఎస్ పార్టీ ఈటల స్థానాన్ని భర్తీ చేయాలనే ఉద్దేశంతో అనేక ఎత్తుగడలు వేస్తోంది. ఇందులో భాగంగా ట్రబుల్ షూటర్ హరీష్ రావును.. రంగంలోకి దించింది. హుజరాబాద్ లో ఎలాగైనా గెలవాలని టిఆర్ఎస్ వ్యూహరచనలు చేస్తోంది. ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణను పార్టీలోకి తీసుకోవాలని టిఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. ఇందులో బాగంగా ఎల్.రమణతో గులాబీ నేతలు ఇటీవలే మంతనాలు కూడా జరిపిన సంగతి తెలిసిందే. దీంతో ఎల్ రమణ టీఆర్ఎస్ లోకి పోవడం గ్యారంటీ అనుకున్నారు అందరూ… అంతే కాదు టిఆర్ఎస్ పార్టీలోకి వెళుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా ఈ అనుమానాన్ని నిజం చేస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఇవాళ  టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ పార్టీ శ్రేణులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. భవిష్యత్ కార్యాచరణ పై పార్టీ శ్రేణులతో ఎల్ రమణ చర్చలు జరుపుతున్నారు. రాబోయే రెండు, మూడు రోజుల్లో తెరాసలో చేరుతున్నట్లు సమాచారం అందుతోంది. తనతో పాటు పార్టీ క్యాడర్ ను కూడా టీఆర్ఎస్ లోకి తీసుకుపోవడానికే ఎల్ రమణ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.