చిరంజీవి పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన ప్రగ్యా జైస్వాల్.. వీడియో వైరల్..!

-

మెగాస్టార్ చిరంజీవి అంటే అభిమానం ఉండని వారు ఎవరు ఉండరు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరికి చిరంజీవి నటన , డాన్స్ అన్నీ కూడా విపరీతంగా ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా సాధారణ అభిమానులకే కాదు చిరంజీవి అంటే చాలామంది స్టార్ హీరో హీరోయిన్లకు కూడా ఇష్టమే
ఇక చిరు నటించిన సినిమాలలో పాటలు వస్తే కొంతమందికి ఏదో తెలియని ఊపు వచ్చేది. ముఖ్యంగా వారికి తెలియకుండానే వారి శరీరంలో డాన్స్ పుట్టుకొస్తుంది. కాళ్లు, చేతులు వాటంతటవే స్టెప్పులెయ్యాలని కూడా ఎదురు చూస్తుంటాయి.

ఇకపోతే తాజాగా చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలోని పాటకు బాలయ్య బాబు హీరోయిన్ అదిరిపోయే స్టెప్పులేసింది. ఇక ప్రగ్యా జైస్వాల్ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు. తెలుగులో బాలకృష్ణ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ కు జోడిగా ప్రగ్యా చాలా మంచి జోడి అనిపించుకుంది. ఇక అనంతరం మంచు మనోజ్ హీరోగా వచ్చిన గుంటూరోడు సినిమాలో కూడా నటించింది. అయితే ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయిన విషయం తెలిసిందే. ఇక బోయపాటి దర్శకత్వంలో జయ జానకి నాయక సినిమాలో కూడా ప్రగ్యా జైస్వాల్ సెకండ్ హీరోయిన్ గా నటించినా . ఈ సినిమా మేకింగ్ పరంగా ఓకే అనిపించకుండా ప్రేక్షకుల ఆదరాభిమానాలు మాత్రం పొందలేకపోయింది.

ఇక రీసెంట్గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా అఖండ సినిమా వచ్చిన విషయం తెలిసిందే.ఈ సినిమా కరోనా సమయంలో విడుదలై కూడా మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.ఇక ఇందులో బాలయ్యతో జోడి కట్టిన ప్రగ్యా జైస్వాల్ కి కూడా మంచి గుర్తింపు లభించింది. కానీ అవకాశాలు అయితే రాలేదు. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ప్రగ్యా తాజాగా తన లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోని తాజాగా చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలోని మార్ మార్ టక్కర్ మార్ పాటకు ప్రగ్య అదిరిపోయే స్టెప్పులు వేసింది. ప్రస్తుతం ఈ డాన్స్ చూసిన మెగా అభిమానులు కూడా ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya)

Read more RELATED
Recommended to you

Latest news