TRS ను BRS చేశారు.. కోడి, క్వాటర్ బాటిల్స్ పంచుతున్నారు – బిజెపి నేత ఎన్వి సుభాష్

-

రాష్ట్రంలోని ప్రధాన సమస్యలను పక్కన పెట్టి, ‘తెలంగాణ రౌడీల సమితి’ దండు అంతా మునుగోడు మీద పడిందని మండిపడ్డారు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్. ఒక్కో ఎమ్మెల్యే కి ఒక్కో గ్రామం ఇచ్చారని.. గులాబీ దండు ప్రజలను మందులో ముంచుతూ… ఓట్లను కొంటోందని ఆరోపించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు మొత్తం మునుగోడులో ప్రజాస్వామ్యాన్ని ముంచుతున్నారని ధ్వజమెత్తారు.

రాష్ట్రంలోని 118 నియోజక వర్గాల్లో పాలన గాలికి వదిలేసి… ఒక నియోజక వర్గం మీద పడ్డారని మండిపడ్డారు. మంత్రి మల్లారెడ్డి స్వయంగా మందు పోస్తూ… టిఆర్ఎస్ వైఖరి ఏంటో స్వయంగా తెలియజేశారని అన్నారు. ఇక కేసీఆర్ అయితే.. పాలనను గాలికి వదిలేసి జాతీయ రాజకీయాలంటూ డ్రామాలాడుతున్నారని… దొంగల బ్యాచ్ తో చేరి, దేశం పట్టుకుని తిరుగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల డబ్బును ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తూ.. దోచుకున్న అవినీతి డబ్బుతో విమానం కొనుక్కుని దేశవ్యాప్తంగా చక్కర్లు కొడుతున్నాడని మండిపడ్డారు ఎన్ వి సుభాష్.

TRS ను BRS చేసి… కోడి, క్వార్టర్ బాటిల్స్ పంచుతున్నారని అన్నారు. ఇక్కడ దోచుకున్నది చాలదని…ఇక దేశం మీద పడ్డాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ అని చెప్పి, బ్రతుకే లేని తెలంగాణ చేశారన్నరు. కెసిఆర్ కుటుంబం మాత్రమే బంగారం అయిందని.. ప్రజలంతా బికారీలు అయిన పరిస్థితి ఉందన్నారు. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే… ఇప్పుడు 5 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశాడని ఆరోపించారు. తెలంగాణ లో కనీసం పండించిన పంటకి కూడా భరోసా లేదని.. రైతు అంటే కేసీఆర్ సర్కార్ కు విలువే లేదన్నారు. పెద్ద దొరకి సీఎం పదవి కాదు… ఇప్పుడు ప్రధానమంత్రి పదవి కావాలట అని దుయ్యబట్టారు.

కేసీఆర్ కి మాత్రం ఆశ చావదు… రైతులు, నిరుద్యోగులు, వీఆర్ఏలు లు మాత్రం చావాలా..?అని ప్రశ్నించారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పేరు చెప్పి లక్షల కోట్లు దండుకున్నారని ఆరోపించారు. జాతీయ పార్టీ పెట్టి, విమానాలు కొనడానికి కేసీఆర్ కు డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి .? అని ప్రశ్నించారు ఎన్ వి సుభాష్. వేల కోట్ల విలువ జేసే ఆస్తులను కేసీఆర్ కూడా బెట్టుకున్నారని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కెసిఆర్ బిడ్డ కవిత ప్రమేయంపై ట్విట్టర్ టిల్లు, కెసిఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు

Read more RELATED
Recommended to you

Latest news