JaiHanuman Poster : శ్రీరామనవమి స్పెషల్.. ‘జై హనుమాన్’కు రాముడి ఆశీర్వాదం

-

శ్రీ రామ నవమి పండుగను పురస్కరించుకుని త్వరలో రాబోయే సినిమాలు కొత్త పోస్టర్లు రిలీజ్ చేశాయి. వీటిలో అందరినీ ఆకర్షించింది మాత్రం ప్రశాంత్ వర్మ తెరకెక్కించనున్న జై హనుమాన్ చిత్రానిది. వచనం ధర్మస్య రక్షణం ( మాట ధర్మాన్ని రక్షిస్తుంది) అంటూ ఈ పోస్టర్ కింద క్యాప్షన్ను జోడించారు. ఇక ఆ పోస్టర్లో శ్రీ రామునికి ఆంజనేయుడు మాట ఇస్తున్నట్లు వారి ఇద్దరి చేతులను చూపించారు. ఈ పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ‘జై హనుమాన్’ సినిమాను తెరకెక్కించే పనుల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అంజనాద్రి 2.0 అంటూ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేయగా, దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు శ్రీ రామనవమి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ కూడా నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం చూస్తుంటే హను-మాన్ను మించేలా ఉందంటూ నెటిజన్లు అప్పుడే పోస్టులు పెట్టేస్తున్నారు. ఎంతైనా మన వర్మ సినిమా అంటే వర్తు బ్రో అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news