తారక్ దంపతులతో ప్రశాంత్ నీల్ సెలబ్రేషన్స్..త్వరలో NTR31 అప్‌డేట్!

-

KGF2 సినిమా ప్రపంచవ్యాప్తంగా చక్కటి ఆదరణ పొందుతోంది. ఈ పిక్చర్ చూసి దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు ఒక్కసారైనా దర్శకుడు ప్రశాంత్ నీల్ తో వర్క్ చేయాలని అనుకుంటున్నారు. రాకింగ్ స్టార్ యశ్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన కేజీఎఫ్ చాప్టర్ 1 నుమించిన విజయం చాప్టర్ 2 సాధించింది.

ఇక ఈ చిత్ర విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు హీరో యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అయితే, ప్రశాంత్ నీల్ KGF2 సెట్స్ మీద ఉండగానే తన నెక్స్ట్ ఫిల్మ్ షూట్ స్టార్ట్ చేశారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ‘సలార్’ మూవీ చేస్తున్నారు. 20 శాతం షూటింగ్ పూర్తయింది కూడా. ఇందులో ప్రభాస్ సరసన హీరోయిన్ గా శ్రుతిహాసన్ నటిస్తోంది.

ప్రశాంత్ నీల్ తన నెక్స్ట్ మూవీ జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోతున్నారు. ఈ క్రమంలోనే తారక్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు ప్రశాంత్ నీల్ దంపతులు. వివాహ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ వచ్చిన ప్రశాంత్ నీల్ దంపతులు..జూనియర్ ఎన్టీఆర్ దంపతులు కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ఈ ఫొటో చూసి నెటిజన్లు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు NTR31 అప్ డేట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ‘కేజీఎఫ్ చాప్టర్ 2, సలార్’ ను మించి ఎన్టీఆర్ 31 ఉండాలని కోరుతున్నారు. RRR సినిమా తర్వాత తారక్..కొరటాల శివ దర్శకత్వంతో ఎన్టీఆర్30 పిక్చర్ చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత 31వ ఫిల్మ్ చేయబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news