ద్రాక్షపండు ఆరోగ్యంగానికి మంచిది. అందులో నల్ల ఎండు ద్రాక్ష ఇంకా మంచిదని వైద్యులు అంటున్నారు. నల్లద్రాక్ష బరువు తగ్గడంలో కొలెస్ట్రాల్ మరియు రక్తపోటు నియంత్రించటంలో నంబర్‌వన్‌గా పనిచేస్తుంది. నల్ల ద్రాక్షను రాత్రంతా నీటిలో నానబెట్టడం వల్ల వాటి ఆరోగ్య ప్రయోజనాలు అనేక రెట్లు పెరుగుతాయి. ఎందుకంటే అలా చేయడం వల్ల వాటిలో యాంటీ ఆక్సిడెంట్ల పరిమాణం పెరుగుతుంది. కేకులు, ఖీర్, బర్ఫీ మొదలైన అనేక రకాల డెజర్ట్‌లలో కూడా ఇది ఉపయోగిస్తారు. జుట్టు రాలడాన్ని తగ్గించడం నుండి మలబద్ధకాన్ని తొలగించడం వరకు, నల్ల ఎండుద్రాక్షలో ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఈరోజు ఈ నల్ల ఎండుద్రాక్ష ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
ఎముకల వ్యాధి నివారణ
పొటాషియంతో పాటు, నల్ల ఎండుద్రాక్షలో చాలా కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలకు మంచిది. అధ్యయనాల ప్రకారం..నల్ల ఎండుద్రాక్షలో ఉండే సూక్ష్మపోషకాలు బోలు ఎముకల వ్యాధి రాకుండా నిరోధిస్తాయి.
నెరిసిన జుట్టు, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది
జుట్టు పొడిబారడం, చీలిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ప్రతిరోజూ నల్ల ఎండుద్రాక్ష తినటం వల్ల.. అవి ఐరన్, శరీరానికి బలమైన శక్తితో పాటు పెద్ద మొత్తంలో విటమిన్ సి ని అందిస్తాయి. ఇది ఖనిజాలను వేగంగా గ్రహించడంలో సహాయపడుతుంది..జుట్టుకు పోషణను అందిస్తుంది.
రక్తపోటు
రక్తపోటు సమస్యతో పోరాడుతున్నట్లయితే, నల్ల ఎండుద్రాక్ష మీకు ఉపశమనాన్ని ఇస్తుంది. ఎండుద్రాక్షలో అధిక పొటాషియం స్థాయి రక్తం నుండి సోడియంను తగ్గించడంలో సహాయపడుతుంది.
రక్తహీనత
రక్తహీనత సమస్యలతో బాధపడేవారు ఐరన్‌లో అధికంగా ఉన్నందున, నల్ల ఎండుద్రాక్షలను క్రమం తప్పకుండా తినడం వల్ల కూడా ప్రయోజనం పొందవచ్చు. రుతుస్రావం సమయంలో నొప్పిని తగ్గించడంలోనూ ఇది సహాయపడుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌తో పోరాడుతుంది. దీనితో పాటు, ఇది శక్తి స్థాయిని మెరుగుపరుస్తుంది.
మలబద్ధకం నుండి ఉపశమనం
మలబద్ధకం సమస్యతో బాధపడేవారు..డైలీ నల్ల ఎండుద్రాక్షను తింటే సమస్య నుండి ఉపసమనం పొందవచ్చు. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
-Triveni Buskarowthu