కొంత మంది దర్శకులు వాళ్ళు అనుకున్న జోనర్స్ లోనే సినిమాలని తీసి సక్సస్ లను అందుకుంటారు. ఒక వేళ ఆ జోనర్ లో తెరకెక్కించిన సినిమాలు ఫ్లాపయినప్పటికి వేరే జోనర్ లో సినిమా మాత్రం చేయడానికి సాహసించరు. అందుకే వీళ్ళకి సక్సస్ లు ఎన్ని వచ్చాయో ఫ్లాపులు అంతకంటే ఎక్కువగా వస్తుంటాయి. అందుకు ఉదాహరణ టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ అని చెప్పాలి. ఆయన సినిమాలన్ని గత కొంతకాలంగా ఒకే జోనర్ లో వచ్చి ఫ్లాపుతున్నాయి. ఇక విక్రమ్ కుమార్ కూడా అదే ఫాలో అవుతున్నాడు.
అయినా నా దారి నాదే అంటూ విక్రమ్ కుమార్ మరోసారి ప్రయోగం చేయడానికే సిద్దమవుతున్నాడు. అది కూడా మళ్ళీ అక్కినేని హీరోతోనే. దర్శకుడు విక్రమ్ కుమార్ చెప్పిన స్టోరీ కి నాగచైతన్య బాగా కనెక్ట్ అయ్యాడట. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ విడుదల అయిన వెంటనే మనం సినిమా స్టార్ట్ చేసేద్దాం అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే ఈ సినిమా కి సంబంధించిన అధికారక ప్రకటన త్వరలో వెలువడనుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాని అన్నపూర్ణ బ్యానర్ లో నిర్మిస్తారా లేదా సమంత నాగ చైతన్య కలిసి పెడుతున్న కొత్త బ్యానర్ లో నిర్మిస్తారా అన్నది కూడా మరికొద్ది రోజుల్లో తెలియనుంది.