బికినీలో బేబీ బంప్‌తో ఫ్లంట్ చేస్తోంది!

బాలీవుడ్ బ్యూటిఫుల్ బేబ్‌ అనుష్క, ఇండియ‌న్ క్రికెట్ టీమ్ సార‌థి విరాట్ కోహ్లీ తాము పేరెంట్స్ కాబోతున్నామంటూ కోట్లాది అభిమానుల‌కు శుభ‌వార్త‌ని వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత వీరిపై సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు అభినంద‌న‌ల వ‌ర్షం కురిపించారు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిక‌ల్లా పండటి పాప‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్నామ‌ని ప్ర‌క‌టించారు. అప్ప‌టి నుంచి అనుష్క‌శ‌ర్మ మ‌ద‌ర్ హుడ్‌ని ఎంజాయ్ చేస్తూ నెటిజ‌న్స్‌తో ప్ర‌తీ మూవ్‌మెంట్‌ని షేర్ చేసుకుంటూ మాతృత్వ‌పు ఆనందాన్ని ఆస్వాదిస్తోంది.

తాజాగా మ‌రో ఫొటోని సోష‌ల్ మీడియా ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేసింది. శుభ‌వార్త‌ని పంచుకున్న సంద‌ర్భంగా బేబీ బంప్ ఫొటోతో వెల్ల‌డించిన అనుష్క శ‌ర్మ తాజాగా చిరున‌వ్వులు చిందిస్తూ బ్లాక్ బికినీలో స్విమ్మింగ్ షూల్‌లో నిల‌బ‌డి చిరున‌వ్వులు చిందిస్తున్న ఫొటోని షేర్ చేసింది. జీవితంపై జ‌ర్మ‌న్ ర‌చ‌యిత ఎఖార్ట్ టోల్లె చెప్పిన సూక్తులతో పాటు అమెరిక‌న్ స్పిర్చువ‌ల్ టీచ‌ర్‌, సైకాల‌జిస్ట్ రామ్‌దాస్ (రిచ‌ర్డ్ అల్‌ప్రెట్) మంచి త‌నం, విశ్వాసంపై చెప్పిన మాట‌ల్ని ఈ సంద‌ర్భంగా అనుష్క శర్మ కోట్ చేయ‌డం ఆక‌ట్టుకుంటోంది. ఈ ఫొటోపై సెలబ్రిటీల‌తో పాటు నెటిజ‌న్స్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.