మంచు విష్ణు ‘కన్నప్ప’కు హీరోయిన్ దొరికేసిందిగా

-

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా షూటింగ్ జెట్ స్పీడులో జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమాలో విష్ణు పోస్టర్ కూడా రిలీజ్ చేసింది చిత్రబృందం. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో స్టార్ నటులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఇప్పటి వరకు హీరోయిన్ పేరు మాత్రం కన్ఫామ్ కాలేదు. గతంలో నుపుర్ సనన్ ను హీరోయిన్ గా ఎంపిక చేసినా డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆమె తప్పుకుంది. ఇక తాజాగా ఆమె స్థానంలో ఇప్పటి వరకు మోడల్‌గా పలు ప్రకటనల్లో కనిపించిన ప్రీతి ముకుందన్‌ వచ్చింది. ఈ బ్యూటీ ‘కన్నప్ప’తో తెరంగేట్రం చేయనుంది.

ఈ సినిమాలో ప్రీతి ముకుందన్‌ను తీసుకుంటున్నట్లు తెలుపుతూ నిర్మాణ సంస్థ ట్వీట్‌ చేసింది. ‘‘కన్నప్ప’తో ప్రీతి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నందుకు ఆనందంగా ఉందంటూ చిత్ర బృందం తెలిపింది. ఎంతో ప్రతిభ కలిగిన ఈ భరతనాట్య నర్తకి సినిమాకు మరింత ప్రత్యేకం కానుంది అని పేర్కొంది.  ఈ సినిమాలో ప్రభాస్‌-నయనతారలు శివపార్వతులుగా కనిపించనున్నట్లు సమాచారం.  మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌, కన్నడ అగ్ర కథానాయకుడు శివరాజ్‌కుమార్‌ , మోహన్‌ బాబు, శరత్‌ కుమార్‌ వంటి భారీ తారాగణం కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news