కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి.. సీఎం రేవంత్‌ రెడ్డి ఫోన్‌

-

తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ప్రధాన దృష్టి సారించింది. అదే విధంగా గత ప్రభుత్వ వైఫల్యాలను సరిదిద్దే పనిలో పడింది. ఓవైపు ఈ పనుల్లో బిజీగా ఉంటూనే మరోవైపు రాష్ట్ర ప్రగతి విషయంలో అన్ని పార్టీలను కలుపుకుని వెళ్లేందుకు కృషి చేస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరిన విషయం తెలిసిందే. దానికి ఆ పార్టీ సానుకూలంగా కూడా స్పందించింది.

ఇక తాజాగా తెలంగాణ అభివృద్ధి విషయంలో పూర్తి సహాయ సహకారాలు అందించాలని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని  రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  కోరారు. ఈ మేరకు కిషన్ రెడ్డికి సీఎం రేవంత్‌ రెడ్డి ఇవాళ ఫోన్‌ చేసి మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధికి సహకరించడంతో పాటు  కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై పరస్పర సహకారం ఉండాలని రేవంత్ రెడ్డి కోరినట్లు తెలిసింది. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న పలు పెండింగ్ అంశాలు, పరస్పర సహకారం కోసం కేంద్ర ప్రభుత్వ ముఖ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కిషన్‌ రెడ్డికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news