ప్రేమ కథా చిత్రం పార్ట్-2.. ఫస్ట్ లుక్ భయపెట్టిస్తుంది..!

-

మారుతి కథ, నిర్మాణంలో 2013లో వచ్చిన ప్రేమ కథా చిత్రం సినిమా సూపర్ హిట్ అయ్యింది. సుధీర్ బాబు, నందిత కలిసి నటించిన ఆ సినిమా మారుతి టాలెంట్ చూపించింది. అయితే ఆ సినిమాకు సీక్వల్ గా ప్రేమ కథా చిత్రం-2 రాబోతుంది. హరికిషన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సుమంత్ అశ్విన్, నందిత శ్వేత లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా నుండి నందిత ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నందిత శ్వేత. ఆ సినిమా తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసినా పెద్ద ఆదరణ దక్కించుకోలేదు. ప్రస్తుతం ప్రేమ కథా చిత్రం సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తుంది. సినిమా నుండి వచ్చిన నందిత ఫస్ట్ లుక్ భయపెట్టేలా ఉంది. తన పెళ్లి చెడగొట్టిన వారి మీద పగ తీర్చుకోవడమే ప్రేమ కథా చిత్రం -2 కథ అని తెలుస్తుంది. మరి మొదటి పార్టులానే కామెడీ, హర్రర్ కలిసి ఈ సినిమా ఎంటర్టైన్ చేస్తుందా లేదా అన్నది చూడాలి. ప్రేమ కథా చిత్రం సినిమా దర్శకుడు సుదర్శన్ రెడ్డి సెకండ్ పార్ట్ నిర్మిస్తుండటం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news