పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ‘ఆడు జీవితం’ (ది గోట్ లైఫ్) సినిమాను ప్రముఖ యాంకర్ సుమ తాజాగా వీక్షించారు. ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు చేశారు. చిత్ర దర్శకుడి ప్రతిభను మెచ్చుకుంటూ పోస్టు పెట్టారు. ‘‘ఆడు జీవితం’ చూశా. నజీబ్ కథను చాలా వివరంగా మనసుని హత్తుకునేలా తెలియజేశారు. దర్శకుడు బ్లెస్సీకి నా సెల్యూట్. పృథ్వీరాజ్.. పూర్తిగా బరువు తగ్గిపోయి, పక్కటెముకలు బయటకు కనిపించే సన్నివేశంలో మిమ్మల్ని చూసి నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. సినిమా పట్ల మీకు ఉన్న ప్రేమ, అంకితభావానికి ఇది నిదర్శనం’’ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చారు.
జీవనోపాధిలో భాగంగా కొన్నేళ్ల క్రితం కేరళకు చెందిన నజీబ్ అనే వ్యక్తి గల్ఫ్ దేశాలకు వెళ్లి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అతడి జీవితాన్ని ఆధారంగా చేసుకుని బెన్నీ డానియేల్ రచించిన ‘గోట్ డేస్’ ను ప్రామాణికంగా చేసుకుని బ్లెస్సీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పృథ్వీరాజ్ సుకుమారన్.. నజీబ్ పాత్ర పోషించారు. అమలాపాల్, కేఆర్ గోకుల్ కీలక పాత్రల్లో నటించారు.
Watched #Aadujeevitham, Najeeb’s story was told so vividly. @DirectorBlessy a big salute to you, @PrithviOfficial tears rolled down my cheeks when I saw the shot where you had lost so much weight for the character and your ribs were visible🙏 Dedication to art of cinema 🙏
— Suma Kanakala (@ItsSumaKanakala) March 29, 2024