భారీ ధరకు అమ్ముడుపోయిన టిల్లు స్క్వేర్ ఓటీటీ రైట్స్..

-

మల్లిక్ రామ్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం టిల్లు స్క్వేర్‌.అనుపమ పరమేశ్వర న్ ఈ చిత్రంలో కథానాయికగా నటించింది.ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. ఇక ఈ చిత్రం నిన్న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.టిల్లు స్క్వేర్‌’కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది .

దీంతో మొదటిరోజు బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ రావడంతో.. ప్రస్తుతం హౌస్ ఫుల్ షోస్ పడుతున్నాయి. కాగా ఈ మోస్ట్ ఎంటర్టైనర్ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకుందట. దాదాపు రూ.14 కోట్లు పెట్టి టిల్లు గాడి ఓటీటీ రైట్స్ ని సొంతం చేసుకున్నారట. ఇక ఈ మూవీ శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా ఛానల్ భారీ ధరకే సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.కాగా ఈ చిత్రం మొదటిరోజు రూ.23.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. సిద్ధూ కెరీర్ లో ఇది హైయెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది. ఈ సినిమా థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ 27 కోట్ల వరకు జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాబట్టి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే.. సుమారు 54 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news