నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. TCSలో ఫ్రెషర్స్ హైరింగ్ షురూ

-

నిరుద్యోగులకు గుడ్న్యూస్. ప్రముఖ ఐటీ కంపెనీ ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్’ (టీసీఎస్) ఫ్రెషర్స్ హైరింగ్ షురూ చేసింది. బీటెక్, బీఈ, ఎంఎస్సీ, ఎంఎస్, ఎంసీఎ పూర్తి చేసినవారికి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్ 10వ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఏప్రిల్ 26వ తేదీన టెస్ట్ నిర్వహిస్తారు.

ప్రస్తుతం డిజిటల్, ప్రైమ్, నింజా కేటగిరీల్లో నియామకాలు చేపడుతున్నట్లు టీసీఎస్ పేర్కొంది. నింజా కేటగిరీ ఉద్యోగులకు ఏడాదికి రూ.3.36 లక్షలు; డిజిటల్ కేటగిరీ ఉద్యోగులకు ఏడాదికి రూ.7 లక్షలు; ప్రైమ్ కేటగిరీ ఎంప్లాయీస్కు ఏడాదికి రూ.9 నుంచి రూ.11.5 లక్షల వేతనం చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఓవైపు చాలా వరకు ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుంటే, టీసీఎస్ మాత్రం ఫ్రెషర్స్ హైరింగ్ చేయడం విశేషం. మరోవైపు 2023-24 ఆర్థిక సంవత్సరంలో టెక్ పరిశ్రమ దాదాపు 60 వేల కొత్త ఉద్యోగాలను కల్పించనుందని ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ తెలిపిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news