ట్రెండ్ ఇన్: అందాల తార ప్రియమణికి శుభాకాంక్షల వెల్లువ

-

బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రియమణి..తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. టాలీవుడ్ స్టార్ హీరోల సరసన దాదాపుగా యాక్ట్ చేసిన ఈ సుందరి..ప్రస్తుతం ఓ వైపు బుల్లితెరపైన ‘ఢీ’షోకు జడ్జిగా వ్యవహరిస్తూనే మరో వైపున వెండితెరపైన కనబడుతోంది. సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోల సరసన కూడా ఈ భామ హీరోయిన్ గా నటించింది.

తెలుగు చిత్రాలతోనే ఫుల్ ఫేమస్ అయిన ఈ సుందరి..తమిళ్ ఫిల్మ్ ‘పరుతివీరన్’ చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫిల్మ్ కు గాను ఈమెకు జాతీయ ఉత్తమనటి అవార్డు వచ్చింది.

శనివారం (జూన్ 4)న ప్రియమణి జన్మదినం సందర్భంగా సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు చెప్తున్నారు. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వేదికగా నెటిజన్లు, సినీ అభిమానులు హ్యాపీ బర్త్ డే చెప్తున్నారు. ప్రియమణి ఫొటోలు షేర్ చేసి విషెస్ చెప్తున్నారు.

#Priyamani ప్రియమణి హ్యాష్ ట్యాగ్ తో ఆమె ఫొటోలు షేర్ చేస్తున్నారు. అలా సదరు హ్యాష్ ట్యాగ్ ట్వి్ట్టర్ లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ప్రియమణి ప్రస్తుతం ‘మైదాన్, సెనేడ్, డాక్టర్ 56, కొటేషన్ గ్యాంగ్’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈమె నటించిన రానా-సాయిపల్లవి ‘విరాట పర్వం’ ఈ నెల 17న విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version