ట్రిపుల్ ఆర్ లో ప్రియమణి.. ఎలగెలగా..?

-

రాజమౌళి తెరకెక్కిస్తున్న మెగా మల్టీస్టారర్ ట్రిపుల్ ఆర్ మూవీపై లేటెస్ట్ అప్డేట్ క్రేజీగా మారింది. సినిమాలో ఎన్.టి.ఆర్, రాం చరణ్ లకు జోడీగా హీరోయిన్స్ ఎవరన్నది ఇంకా డిసైడ్ చేయలేదు. కాని ఇంతలోనే ట్రిపుల్ ఆర్ లో ప్రియమణి నటిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే ప్రియమణి హీరోయిన్ గా కాకుండా విలన్ సైడ్ ఉండే వారిలో ఒకరిగా కనిపిస్తుందట. రాజమౌళి యమదొంగ సినిమాలో ప్రియమణి హీరోయిన్ గా నటించింది.

పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్న ప్రియమణి రీసెంట్ గా డ్యాన్స్ షోకి జడ్జ్ గా వ్యవహరిస్తుంది. ట్రిపుల్ ఆర్ లో ప్రియమణి ఎలాంటి రోల్ చేస్తుంది..? అసలు ఆమె ఉంటుందా లేదా అన్న వార్తలపై క్లారిటీ లేదు. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఈ మల్టీస్టారర్ మీద అంచనాలు పెరిగాయి. ఈమధ్యనే మొదలైన ట్రిపుల్ ఆర్ మొదట యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేస్తున్నారట.

డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీ 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారు. తెలుగు, తమిళ, హింది భాషల్లో బాహుబలి రేంజ్ లో ఈ మూవీని రిలీజ్ చేయాలని చూస్తున్నారు. 2020 సమ్మర్ కల్లా ఈ మూవీ రెడీ అవుతుందట. మరి రాజమౌళి ఈ ట్రిపుల్ ఆర్ తో ఇంకెన్ని అద్భుతాలు చేస్తాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news