హాలీవుడ్ నీళ్లు బాగా పడినట్టు కనిపించిన ప్రియాంకా చోప్రా నీళ్లేంటి అక్కడ మనుషులు కూడా సొంతమయ్యారని నిక్ తో ఎంగేజ్మెంట్ తో చెప్పేసింది. హాలీవుడ్ ఇంటి కోడలు కాబోతున్న అమ్మడు ఇక్కడ వారికి అక్కడి కల్చర్ అలవాటు చేయాలని తెగ ఉబలాట పడుతుంది. అందుకే కొత్త కొత్త ఆలోచనలతో బిజినెస్ డీల్స్ చేస్తుంది.
అందులో భాగంగా ఇండియాలో ప్రియాంకా ఓ కొత్త డేటింగ్ యాప్ ఇంట్రడ్యూస్ చేయబోతుందట. జంబుల్ అనే డేటింగ్ యాప్ ను ఇండియాలో ప్రవేశ పెట్టబోతుందట ప్రియాంకా. ఇందులో స్త్రీలకు చాటింగ్ చేసే అవకాశం కల్పిస్తామని చెబుతుంది. మన దేశంలో డేటింగ్ కల్చర్ అంతగా ఉండదు. మరి అలాంటిది ప్రియాంకా జంబుల్ యాప్ ఏ విధంగా రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
ఈ యాప్ ఇండియాలో వచ్చేందుకు ఇన్వెస్ట్ చేస్తుందట ప్రియాంకా. అంతేకాదు కోడింగ్ అనే ఇంటర్నేషనల్ స్కూల్ లో కూడా ప్రియాంకా చోప్రా పెట్టుబడులు పెట్టిందట. అక్కడ సంపాదించి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం బాగుంది. అయితే డేటింగ్ యాప్ కే ప్రభుత్వాల మద్ధతు.. నియమ నిబంధనలు ఎలా ఉంటాయో చూడాలి.