ప్రియాంకా పెళ్లి ఖర్చు ఏ రేంజ్ లో అంటే..!

-

బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ప్రియాంకా చోప్రా అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ ప్రేమించుకుని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని తెలిసిందే. డిసెంబర్ 2న వీరి వివాహం జరుగనుంది. రాజస్థాన్ జోద్ పూర్ లో వివాహం జరుగుతుండగా అక్కడ ఉన్న ఉమైద్ భవన్ ప్యాలెస్ లో విడిది ఏర్పాటు చేశారట. నవంబర్ 30 నుండి డిసెంబర్ 3 వరకు ఐదురోజుల దాకా ఆ ప్యాలెస్ బుక్ చేసినట్టు తెలుస్తుంది.

ప్యాలెస్ లో రూపుల కోసమే దాదాపు 4 కోట్ల దాకా ఖర్చు పెట్టారని తెలుస్తుంది. క్యాటరింగ్ ఖర్చు కూడా ఒక మనిషికి 18వేల రూపాయలని తెలుస్తుంది. దీన్నిబట్టి చెప్పొచ్చు ప్రియాంకా, నిక్ ల పెళ్లి ఎంత గ్రాండ్ గా జరుగుతుందో. ఇద్దరు సెలబ్రిటీస్ కాబట్టి పెళ్లి ఖర్చులకు ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదట. ఈమధ్యనే రణ్వీర్ దీపికలు పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లికి భారీగానే ఖర్చు అయ్యిందని అంటున్నారు.

దీప్-వీర్ ల పెళ్లి ఇరాక్ లో జరిగింది. వారి పెళ్లికి కేవలం 300 మంది సెలబ్రిటీస్ మాత్రమే వచ్చారు. కాని ప్రియాంకా, నిక్ జోనస్ ల పెళ్లి ఇక్కడే జరుగుతుంది. అందుకే సిని, రాజకీయ వర్గాల వారు కూడా భారీగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అందుకు తగినట్టుగానే ఏర్పాట్లు జరుగుతున్నాయట.

Read more RELATED
Recommended to you

Exit mobile version